తుళ్లూరు మండలం అనంతవరం ఆర్-5 జోన్లో విధుల నిమిత్తం వెళ్లిన తాళ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇరిగిపోయిన పవన్ కుమార్ (32) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా గుంటూరు రమేష్ హాస్పటల్లో చికిత్స పొందుతూ డయాలసిస్ చేసి అన్ని విధాలుగా ప్రయత్నించినా సరే పవనకుమార్ మృతి చెండటం పోలీస్ వర్గాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీస్ ఉన్నతాధికారులు, దర్శి డీఎస్సీ, సీఐ, ఎస్సైలు నిరంతర పర్యవేక్షణ చేసినా సరే పవన్ కుమార్ ను దక్కించుకోక పోవటంపై పోలీస్ వర్గాలలో తీవ్ర విషాదం నెలకొన్నది. పవన్కుమార్ చీమకుర్తి పట్టణం. 2012 జవవరి 19లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేసారు. తాళ్లూరు, ఒంగోలు వన్ టౌన్, ముండ్లమూరులలో పనిచేసి మరలా జనవరి రెండవ తేదీన 2020న తాళ్లూరు పోలీస్ స్టేషన్లలో జాయిన్ అయ్యారు. ఎస్సైగా ఎప్పటికైనా ఎంపిక కావాలన్న ఆశయంతో ఉంటూ అంకిత భావంతో పనిచేసే పవన్ ఇక లేక పోవటం దృరదృష్టకరమని స్నేహితులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. పవన్కుమార్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.




