రాజధాని ప్రాంతం ఆర్-5 జోన్లో భద్రతా విధులు నిర్వహిస్తూ దురదృష్టవశాత్తు పాముకాటుకు గురై బుదవారం రాత్రి మరణించిన ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పవన్ కుమార్ గారి మృతదేహానికి ఎమ్మెల్యే ఆర్కే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుని పార్థివదేహానికి నివాళులు అర్పించి అక్కడ ఉన్న మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు..
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి మృతుని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
వ్యక్తిగతంగా మృతుని కుటుంబానికి అండగా నిలిచేలా ఆయన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.