పలు కారణాలతో తల్లిదండ్రుల నుంచి తప్పి పోయిన పిల్లలను చేరదీసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని లోక్ అదాలత్ చైర్మన్, సీనియర్ న్యాయమూర్తి జి. ఎల్. వి. ప్రసాద్ సూచించారు. ‘అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల సంరక్షణ దినం’ సంద ర్భంగా స్థానిక కోర్టులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు. లోక్ అదాలత్ చైర్మన్ ,సీనియర్ న్యాయమూర్తి జి. ఎల్. వి. ప్రసాద్ మాట్లాడుతూ… తప్పి పోయిన పిల్లలు హోటళ్లు, మెకానిక్ షెడ్లు వంటి చోట వెట్టిచాకిరీ చేస్తున్నారని వీరిని గుర్తించి ఆ పనుల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఇలాంటి పిల్లలకు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక వసతిగృహాలు ఏర్పాటు చేశారని వివరించారు. డీటీ రవిశంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటి రెడ్డి, న్యాయవాదులు చెన్నకేశవులు, సురేష్ పాల్గొన్నారు.
