వైఎస్సార్సీపీ బీసీ సంఘ నాయకుడు, మాధవరం సర్పంచి తాటికొండ రేణుక భర్త ఏడుకొండలు (45) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృత దేహానికి వైఎస్సార్సీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి. వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, ఎం.ఎస్.పి నాగార్జున రెడ్డిలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనకు ఇరువురు కుమారులు ఉన్నారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. పలు గ్రామాల సర్పంచిలు వలి. పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కెవీ పాలెం జెసీఎస్ కన్వినర్ కొర్రపాటి విష్ణు తదితరులు పాల్గొన్నారు.
