ఆదర్శ పాఠశాలలో మంచి విద్యాబోధన

ముండ్లమూరులో గల ఆదర్శ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన, నైతిక విలువలతో కూడిన మంచి అనుభవం గల ఉపాధ్యాయులతో విద్యా బోధన చేయడం జరుగుతుందని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కే పూర్ణచంద్రరావు అన్నారు. శుక్రవారం ఆదర్శ పాఠశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా కళాశాలలో మంచి విద్యతోపాటు, తండ్రి లాంటి సేవ ,తల్లి లాంటి ప్రేమతో విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య అందించడం జరుగుతుందన్నారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయన్నారు. విశాలమైన ఆట స్థలంలో ఉత్సాహపరిచే క్రీడలను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని, శారీరిక శ్రమను జోడించి ఆటల్లో రాణించేలా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అడ్మిషన్ పొందడానికి చివరి తేదీ జూన్ 5వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో భాషా పండితులు, గణితం, సైన్స్, సోషల్ ఉపాధ్యాయులు , వెంకటేశ్వర రెడ్డి, పిడి రాముడు , ఎలిసా, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *