వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి, మాధవరం గ్రామ ప్రధాన వైఎస్సార్సీపీ నాయకుడు నుసుం చిన అంజనేయులు (59) శనివారం గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన పొలంలో వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం వెళ్లగా ఒక్కసారిగా గుండె పోటుతో కుప్పకూలి పోయాడు. ఆయన తండ్రి సుసుం పెద లక్ష్మి రెడ్డి, తమ్ముడు సుబ్బా రెడ్డిలు సర్పంచిలుగా పనిచేసారు. ఆయనకు భార్య ఇరువురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఫోన్ చేసి వారి కుటుంబాన్ని పరామర్శించాడు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇనేచార్జి మదిశెట్టి రవీంద్ర ఆయన మృత దేహానికి నివాళులు అర్పించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి. వైఎస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం.ఎన్.పి నాగార్జున రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ ఐ. వేణుగోపాల్ రెడ్డి. పలు గ్రామాల సర్పంచిలు పి. ఎస్. శ్రీకాంత్ రెడ్డి, వలి, బ్రహ్మ రెడ్డి, ఎంపీటీసీలు, ప్రధాన నాయకులు ఆయన మృత దేహానికి నివాళులు అర్పించారు.

