అనాదీనా భూములకు అసైన్మెంట్ కమిటీలో దరఖాస్తు చేసుకోవాలి

ముండ్లమూరు మండలం లో ని గ్రామాలలో ఎస్సీ ఎస్టీలు భూమి లేని నిరుపేదలు అనాధీన భూములను సాగు చేసుకుంటున్నావారు అసైన్మెంట్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ తహసిల్దార్ జి. పుల్లారెడ్డి అన్నారు. స్థానిక వైకెపి కార్యాలయంలో శనివారం భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ భూమిలేని నిరుపేద రైతులు వ్యవసాయ అభివృద్ధి పథకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం రీసర్వే ద్వారా భూములు కొలతలు వేస్తున్నారని, భూములు గల యజమానులు మీ దగ్గర ఉన్న సమాచారం తీసుకొని పొలాల దగ్గరికి వెళ్లి సర్వే చేయించుకోవాలన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపన బోయిన వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని, ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రాయితీపై ఎరువులు అందిస్తుందని, ఇలాంటి పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకెపి సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *