వేసవి శిక్షణ శిబిరంతో విద్యార్థుల జ్ఞాన సమ పార్జనకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగం -గ్రంథపాలకురాలు విజయకుమారి

గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంతో విద్యార్థులకు జ్ఞాన సమపార్థనతో ఎంతో లాభం చేకూరుతుందని గ్రంథ పాలకురాలు వి విజయ కుమారి అన్నారు. తాళ్లూరు మండల కేంద్రమైన తాళ్లూరులోని ప్రభుత్వ శాఖ గ్రంధాలయం నందు ఆదివారం వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా కథలు చెప్పడం, కథలు చదివించడం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది . అదేవిధంగా బాల బాలికలలో ఆసక్తి కలిగిన వారితో స్కిప్పింగు, చెస్ ఆటలను ఆడించి వారిలోని నైపుణ్యాలను బయటకు తీసుకు రావడం జరిగింది. చదివే తత్వం వారిలో అభివృద్ధి చెందుతుందని, సమయం సద్వినియోగం చేసుకొని, గ్రంథాలయాలను ఉపయోగించు కుని బాల బాలికలు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో 15 మంది బాల బాలికలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *