రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి ఏమి అందివ్వాల్లో ఆసంక్షేమాన్ని ఇచ్చిన హామీ మేరకు అమలు చేసిన సంక్షేమ రథసారధి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. పట్టణంలోని 1,2వ వార్డుల్లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ కు హారతులు ఇచ్చి, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ మాట్లాడుతూ …సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 98 శాతం పైగా అమలు చేసి ప్రజ ల్లోకి వెళుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వంలో చేసిందేమీ లేక అబద్ధపు హామీలే మరలా మళ్లీ ఇస్తున్నారని మండి పడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పారు. చంద్రబాబు గత మేనిఫెస్టోలో ఇచ్చిన 600 పైగా హామీలు తీసుకుని ఏంచేశారో, ప్రజలకు చెప్పి ఎన్నికలకు రావాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ సుధా అచ్చయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, మండల పార్టీ కన్వీనర్ వెన్నపూస వెంక టరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, కౌన్సిలర్లు వీసీరెడ్డి, మోహన్ బాబు, సొసైటీ అధ్యక్షులు వేమిరెడ్డి చెన్నా రెడ్డి, , కమిషనర్ మహే శ్వరరావు, డీటీ రవికుమార్, ఏఓ బాలకృష్ణనాయక్, నాయకులు వెన్నపూస శేషిరెడ్డి, వెన్నపూస రామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, రమ ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.




