పదవ తరగతి సంప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నా పత్రాలు మంగళవారం తాళ్లూరు పోలీస్ స్టేషన్ కు చేరాయి. మండలంలో 218 మంది సప్లిమెంటరీ పరీక్షలు హాజరు అవుతున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 184మంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 34 మంది ఉన్నారు. మండలంలో వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సరస్వతి ఉన్నత పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసారు. ఆయా కేంద్రాలకు ఆంజనేయులు, గోవర్ధన్ లు ఛీఫ్ లు గా , జి. శ్రీనివాసరావు, ఎస్. శ్రీనివాసరావులు డిపార్ట్మెంట్ అధికారులు (డీఓ)లుగా వ్యవహరించనున్నారు. పరీక్షా పత్రాలను చీఫ్ లు, డీఓలు తీసుకుని బాక్స్లో భద్రపరచి పోలీస్ స్టేషన్లో ఉంచారు.
పోలీస్ స్టేషన్కు చేరిన పది ప్రశ్నాపత్రాలు
30
May