నాలుగు వసంతాలలో విప్లవాత్మక సంస్కరణలు – ఉల్లాసంగా .. ఉత్సాహంగా – దర్శి పట్టణంలో నాలుగు వసంతాలు పూర్తి అయిన సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహణ – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణ – బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

వైఎస్సార్సీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నందున జనమంతా జగనన్నే మా నమ్మకం అంటూ నినదిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కోన్నారు. వైఎస్ జగనన్న ప్రభుత్వం ఏర్పడి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శి పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి కురిచేడు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుండి గడియారం స్తంభం సెంటర్, అద్దంకి రోడ్ లోని రెడ్డి కాంప్లెక్స్, పొదిలి రోడ్ లోని డీఎస్పీ కార్యాలయం మీదుగా గడియారం స్తంభం సెంటర్ వరకు నాలుగు కిలో మీటర్ల మేర బైక్ ర్యాలీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఎమ్మెల్యే స్వయంగా బైకు నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఉత్సాహంగా శ్రేణులు జై జగన్, జై మద్దిశెట్టి అంటూ …నినదిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రెడ్డి కాంప్లెక్స్ వద్ద, గడియారం స్తంభం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ …దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆయనకు ప్రతి ఒక్క లబ్ధిదారు 2024లో అధికారంలోనికి రావటానికి అండగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. నాలుగేళ్లలో రెండు సంవత్సరాలు కోవిడ్లో ‘ ఇబ్బందులు పడినా సరే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంతో పాటు దర్శిలో కూడ అమలు చేసారని అన్నారు. దర్శిలో సీఎం సహకారంతో నగర పంచాయితీ, డిగ్రీ కళాశాలతో పాటు, అనేక అభివృద్ధి పథకాలకు నిధులు సాధించామని చెప్పారు. రాబోవు రోజులలో అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని అన్నారు. నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదవ వసంతంలోనికి అడుగుపెడుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు,ధన్యవాదాలు చెబుతున్నట్లు చెప్పారు. ముందుగా షార్టీ కార్యాలయంలో, గడియారం స్తంభం సెంటర్లో కేక్ కట్ చేసి పంచి పెట్టారు..
కార్యక్రమంలో తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్), ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, దర్శి, కురిచేడు ఎంపీపీలు జీఎస్ అచ్చారావు, చంద్రశేఖర్, జెడ్పీటీసీలు మారం వెంకట రెడ్డి, సుధాకర్, దర్శి, తాళ్లూరు వైస్ఎంపీపీలు సోము దుర్గా రెడ్డి, ఐ. వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, సొసైటీ చైర్మన్ వేమి రెడ్డి చెన్నా రెడ్డి, జెసీఎస్ కన్వినర్లు బత్తిన వెంకటేశ్వర్లు, ఎదురు కోటి రెడ్డి, జిల్లా ఎంపీటీసీ సంఘ అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, కేసరి శ్రీనివాస రెడ్డి. విజిలెన్స్ కమిటీ మెంబర్ సోము అనిల్ కుమార్ రెడ్డి, కిక్కిరు రమణా రెడ్డి, కట్టెకోట హరిష్, పలు గ్రామాల సర్పంచిలు రాము. సుబ్బా రెడ్డి, శ్రీనివాస్, సుబ్బారావు, వెంగయ్య, వెంగయ్య, పుల్లయ్య, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, మందాశ్యామ్సన్, మేకలచార్లెస్ సర్జన్, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా , యలమందా రెడ్డి, కటకంశెట్టి శ్రీనివాసరావు, ఉప సర్పంచి రామక్రిష్ణ , మిల్లర్ బుజ్జి, ఎం. హనుమంతరావు, పూనూరి దేవదానం, చందన, కటకంశెట్టి ఆంజనేయులు. ఎం. బ్రహ్మా రెడ్డి, ఓబులు రెడ్డి, జయ రామి రెడ్డి . బాలి రెడ్డి ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *