ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతను పొగాకు అలవాటుకు దూరం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 రోజుల వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. పొగాకు హానికర ప్రభావాలపై ప్రజలను చైతన్యవంతులను చేయటం, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధిస్తున్న 2003 నాటి కోష్టా చట్టం అమలును కఠినతరం చేయటం, గ్రామాలను పొగాకు రహితంగా మార్చటం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. పొగాకు వ్యతిరేక దినోత్సవం నాడు చేపట్టనున్న కార్యక్రమాల్లో ప్రధానంగా
1. ప్రజలను చైతన్యవంతం చేసే కార్యకలాపాలు
2. విద్యా సంస్థలలో ‘పొగాకు వ్యతిరేక ప్రతిన’
3. పొగాకు పర్యవేక్షకుడిగా ఒక టీచర్
/ స్టాఫ్/విద్యార్ధిని నియమించటం
4. పొగాకు దుష్ప్రభావాలపై విద్యార్థులతో వ్యాసరచన, చిత్రలేఖనం, పాస్టర్, క్విజ్, డిబేట్ పోటీలను
నిర్వహించటం
5. స్కూల్ అసెంబ్లీ, స్కూల్ ర్యాలీలు, ప్రభాత భేరీ వంటి కార్యక్రమాలలో పొగాకు దుష్ప్రభావాలపై చర్చించటం
6. స్కూల్ కు వంద గజాల పరిధిలో పాగాకు వినియోగంపై నిషేధం విధిస్తూ యెల్లోలైన్ ఏర్పాటు చేయటం
7. విద్యా సంస్థను పాగాకు రహితంగా ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక పంపటం.
8. కోష్టా చట్ట నిబంధనల మేరకు చట్టపరమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయటం
9. హాట్స్పాట్లుగా వున్న ప్రాంతాలలో కోష్టా చట్టం కఠినంగా అమలు చేయటం
10. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసే వారికి చలానా విధించటం, విక్రయ ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన పొగాకు ఉత్పత్తుల ప్రకటన బోర్డులను తొలగించటం, హెచ్చరికలు లేని పాగాకు
ఉత్పత్తుల ప్యాక్లను సీజ్ చేయటం.
11. స్థానిక రాజకీయ నేతలు, పంచాయితీ పెద్దలు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ‘పొగాకు రహిత
గ్రామం’గా ప్రకటించే కార్యక్రమాన్ని నిర్వహించటం
12. మైకుల ద్వారా ప్రచారం, గోడ రాతలు, వీధి నాటికలు, చర్చా వేదికల ద్వారా “పొగాకు రహిత గ్రామం” కార్యక్రమానికి మద్దతు కూడగట్టే కార్యక్రమాలు చేపట్టడం
13. గ్రామ పంచాయితీ సభ్యులు, స్వయం సహాయక గ్రూపులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, రైతులను చైతన్యపరిచేందుకు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించటం 14. గ్రామాన్ని పొగాకు రహితంగా కొనసాగించేందుకు పొగాకు నియంత్రణా కార్యకలాపాలపై గ్రామసభ/పాలక మండలి నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వడం.
*యువతను ఆకర్షించేందుకు పొగాకు పరిశ్రమల ప్రయత్నాలకు అడ్డుకట్ట*
యువతను పాగాకు వినియోగానికి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 60 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మే 31వ తేదీన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రితో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై యువతను చైతన్యవంతం చేసి, వినియోగదారులతో ఆ అలవాటును మాన్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు పొగాకు పరిశ్రమలు చేసే ప్రయత్నాల నుండి వారిని కాపాడి చైతన్యవంతం చేయటంపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. 60 రోజుల పాటు కొనసాగే ఈ ప్రచార కార్యక్రమం మే 31వ తేదీ నుండి జులై 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. పొగాకు వినియోగాన్ని నియంత్రించేందుకు అనేక విధానాలను అమలు చేయటంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో అగ్రగామిగా వున్నప్పటికీ పొగాకు ప్రజారోగ్యానికి చేటు చేయటంలో ముందంజలో వున్న విషయం తెలిసిందే. గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే (గాట్స్) ప్రకారం. 2016-17లో మొత్తమ్మీద పొగాకు వినియోగం 29.6 శాతం వుండగా గ్రామాలలో 32.5 శాతం, పట్టణ ప్రాంతాలలో 21.2 శాతం మేర నమోదయింది. అయితే 2009 10లో నమోదయిన 34.6 శాతం వినియోగం నుండి 2016-17 నాటికి 17.3 శాతం మేర తగ్గటం గమనార్హం. పొగాకు వినియోగం. కేవలం పెద్దలలో మాత్రమే కాక వయోజనులలో కూడా తగ్గుముఖం పట్టింది. గ్లోబల్ యూత్ టుబాకో సర్వే (జివైటిఎస్) ప్రకారం 2019లో 13-15 ఏళ్ల మధ్య వయోజనులలో పొగాకు వినియోగం 8.5
నమోదు కాగా 2010 నాటి 14.6 శాతంతో పోలిస్తే 42 శాతం మేర తగ్గుదల కన్పిస్తోంది.
*పొగాకు వినియోగం వల్ల నష్టాలివే*
పొగాకు వినియోగం వల్ల అనేక నష్టాలున్నాయి. శరీరంలో ప్రధాన భాగాలు చెడిపోవటం, మరణాలు సంభవించటం వంటి వాటితో సమాజంతో పాటు వారి కుటుంబాలకు కూడా తీవ్ర నష్టం జరుగుతోంది. పొగాకు వినియోగంతో క్యాన్సర్, కరోనరి ఆర్టెరి (గుండె జబ్బు). ఊపిరితిత్తుల వ్యాధి. వంటి వ్యాధులు ప్రధానంగా దాడి చేస్తాయి. ధూమపానం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 12 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ చెబుతోంది. ధూమపానం, పరోక్ష ధూమపానం వంటి అలవాట్ల ద్వారా మన దేశంలో ఏటా 13.5 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. పొగాకు వినియోగంతో మానవ ఆరోగ్యంపై కలిగే హానికర ప్రభావాలపై మరింత పరిశోధన చేయటంతో పాటు, పొగాకు వినియోగ నియంత్రణను మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుందని చెప్పక తప్పదు. పొగాకు వినియోగంతో ప్రాణాలకు మాత్రమే కాక పర్యావరణ పరంగా కూడా భారీ నష్టం సంభవిస్తుంది. అంతేకాదు సామాజిక, ఆర్ధిక సమస్యగా కూడా మారుతోంది. మన దేశంలో పొగాకు వినియోగంతో కలిగిన వ్యాధులు, మరణాలతో 2017-18లో ఏర్పడిన నష్టం విలువ రు.1,77,341 కోట్లు అని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. పొగాకు వినియోగం ద్వారా కలిగే క్యాన్సర్లలో 48.7 శాతం మేర పురుషుల్లోనూ, 16.5 శాతం మేర మహిళల్లోనూ కలుగుతోందని తెలుస్తోంది. స్త్రీ పురుషులు తేడా
లేకుండా ఆస్పత్రుల్లో చేరుతున్న క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను పరిశీలిస్తే పొగాకు సంబంధిత క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు 33.3 శాతం మంది వున్నట్లు తెలుస్తోంది. పొగాకు వినియోగంతో ఏర్పడే దుష్ప్రబావాలు, రిస్క్లల గురించి తెలియ చేసేందుకు మన రాష్ట్రంలో కూడా ఏటా మే 31వ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ‘మాకు ఆహారం కావాలి. పొగాకు వద్దు’ అన్న నినాదంతో 2023 పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.