జనరంజక పాలనకు నాలుగేళ్లు చీమకుర్తిలో భారీ ర్యాలీ నిర్వహణ – స్వయంగా బైక్ నడిపిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి – ఉత్సాహంతో కేరింతలు కొట్టిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి మంగళవారానికి నాలుగేళ్ళు కావడం సంతోషంగా ఉందని జిల్లా పరిషత్ చైర్ప ర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఆమె కుమా రుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డితో ఎన్ఎస్పీ కాలనీలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం కేకును కట్చేసి అందరికీ పంచిపెట్టారు. వారు మాట్లాడుతూ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నాలుగేళ్ళు పూర్తికావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్ఎస్పీ కాలనీ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా మోటార్ సైకిళ్ళపై బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలను పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొనడంతో కార్యకర్తలు కేరింతలు కొడుతూ జై జగన్ జై బూచేపల్లి అంటూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు . కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, ఎంపీపీ యద్దన పూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీని వాసరావు, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, రూరల్ మండల కన్వీనర్ పమిడి వెంకటే శ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ బాపతు వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పం చ్లు. పార్టీ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *