దర్శిలో సాగుతున్న భూకబ్జాలపై ఆర్డిఓ అజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అద్దంకి రోడ్డులో కబ్జాలకు గురవుతున్న స్థలాలను పరిశీలించి అక్రమార్కులు ఏర్పాటు చేసిన కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు హెచ్చరిక బొర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అద్దంకి రోడ్డుతో పాటు పొదిలి రోడ్డు కురిచేడు రోడ్డు తూర్పు గంగవరం రోడ్డు లలో కబ్జాలు కు గురవుతున్న ప్రభుత్వ భూములు అన్నిటిపై దర్శికి చెందిన కొందరు స్థానికులు ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఆర్డిఓ సీరియస్ అయినట్లు సమాచారం.
