15 రోజుల్లో హౌసింగ్ సమస్యల పరిష్కారం -ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి

హౌసింగ్ లబ్ధిదారులకు సహకరించి త్వరితగతిన బిల్లులు చేయాలని దర్శి శాసనస భ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశిం చారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే లబ్ది దారులను పిలిచి సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. వాటిపై అధికారులతో ఆయన సమీక్ష చేసి సమస్యలు పరిష్కరించాలని, కొత్త సమస్యలు సృ ష్టించవద్దని సూచించారు. ప్రభుత్వం పథకాలు ఇస్తున్నా వాటిని ఇంజినీరింగ్ సిబ్బంది మోకాలడ్డ వద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని హితవు పలికారు. ప్రజలు చెప్పిన సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించి 15 రోజుల్లో బిల్లులు చెల్లించేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంజూరైన ఇళ్లకు బిల్లులు చేయకుండా ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కొత్తగా వచ్చే అర్జీలను ఆన్లైన్ చేయాలని సూచించారు. హౌసింగ్ ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు చెల్లించేందుకు వారి నుంచి అనుమతి పొందామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో
ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, ఎంపీటీసీలు కానాల శివా రెడ్డి, బుల్లం వెంకట నర్సయ్య, ఆవుల లక్ష్మీదేవి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కేసనపల్లి నాగేశ్వరరావు, కురిచేడు, కల్లూరు సర్పంచ్లు కేసనపల్లి కృ ష్ణయ్య, నక్కా రామకృష్ణయ్య, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య, నాయకులు మేరువ సుబ్బారెడ్డి, మేరువ పిచ్చిరెడ్డి, బెల్లం చం ద్రశేఖర్, కండె గంగయ్య, ఇందూరి సుబ్బారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, షేక్ మస్తాన్ వలి, చిన పెద్దయ్య, తెల్లమేకల వెంకటేశ్వర్లు, గొట్టిపాటి బాలకోటయ్య, గొట్టిపాటి బొల్లికొండయ్య, వరికూటి వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి నాగిరెడ్డి, సిద్ధి వెంకటరెడ్డి, చెన్నంశెట్టి గురవయ్య, ఎంపీడీఓ వసంతరావునాయక్, తహసీల్దార్ షేక్ నాగూల్ మీరా, హౌసింగ్ డీఈఈ నిరీక్షణరావు, ఏఈ మనోహరబాబు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *