వలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారదలుగా పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. కురిచేడు మండలంలో బుధవారం వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహించారు .ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని వలంటీర్ల సేవలను కొనియాడారు. అనంతరం మండలంలో ఉత్తమ సేవలందించిన 145 మంది వలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేశారు. వారిలో సేవా వజ్రను మండలంలోని పెద్దవరం గ్రామ వలం టీర్ చెన్నంశెట్టి అనూషను వరించింది. సేవారత్న ఐదుగురు, సేవా మిత్రలు 139 మందికి శాలు వాలు కప్పి సర్టిఫికెట్లు అందజేశారు.
కార్యక్రమంలో
ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, ఎంపీటీసీలు కానాల శివా రెడ్డి, బుల్లం వెంకట నర్సయ్య, ఆవుల లక్ష్మీదేవి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కేసనపల్లి నాగేశ్వరరావు, కురిచేడు, కల్లూరు సర్పంచ్లు కేసనపల్లి కృ ష్ణయ్య, నక్కా రామకృష్ణయ్య, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య, నాయకులు మేరువ సుబ్బారెడ్డి, మేరువ పిచ్చిరెడ్డి, బెల్లం చం ద్రశేఖర్, కండె గంగయ్య, ఇందూరి సుబ్బారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, షేక్ మస్తాన్ వలి, చిన పెద్దయ్య, తెల్లమేకల వెంకటేశ్వర్లు, గొట్టిపాటి బాలకోటయ్య, గొట్టిపాటి బొల్లికొండయ్య, వరికూటి వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి నాగిరెడ్డి, సిద్ధి వెంకటరెడ్డి, చెన్నంశెట్టి గురవయ్య, ఎంపీడీఓ వసంతరావునాయక్, తహసీల్దార్ షేక్ నాగూల్ మీరా, హౌసింగ్ డీఈఈ నిరీక్షణరావు, ఏఈ మనోహరబాబు పాల్గొన్నారు.












