రైతు భరోసా కేంద్రాల ద్వారా నగదు చెల్లించి నాణ్యమైన విత్తనాలు పొందాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. తాళ్లూరు, తాళ్లూరు-2 రైతు భరోసా కేంద్రాలలో గురువారం సందర్శించి వ్యవసాయ సహాయకులకు, రైతులకు తగిన సూచనలు చేసారు. ఖరఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎంపీ సీడ్స్, వ్యవసాయశాఖ ద్వారా విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసిందని చెప్పారు. మొక్కజొన్న, మిరప, ప్రొద్దు తిరుగుడు, ప్రత్తి, సజ్జ, సోయా చిక్కుడు, అలసంద, వరి, ఉల్లి పలు రకాల విత్తనాలు వివిధ రకాల కంపెనీలకు చెందిన వివిధ పరిమాణంలో కల్గిన ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విత్తనాలు కావాల్సిన రైతులు స్థానిక వ్యవసాయ గ్రామ సహాయకులను సంప్రదించి కియోస్క ద్వారా ఎంపిక చేసుకుని నగదు చెల్లించి రసీదు పొందినట్లయితే విత్తనం రైతులకు నాలుగు రోజులలో అందుతుందని వివరించారు. రైతులు ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు పొందండి
01
Jun