వార్షిక తనిఖీల్లో భాగంగా దర్శి సర్కిల్ లోని దర్శి పోలీస్ స్టేషన్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ తనిఖీ చేసారు. ముందుగా స్టేషన్ ఆవరణాన్ని మరియు స్టేషన్ లోని రిసెప్షన్, లాకప్, కంప్యూటర్ గది, రైటర్ రూం, రిసెప్షన్ కౌంటర్ లను పరిశీలించారు.
దర్శి పోలీసు స్టేషన్లలో నమోదుకాబడిన మర్డర్, దొంగతనాలు, క్రైమ్ ఎగైనెస్ట్ వుమన్, మిస్సింగ్, Cr. PC174 కేసులు మరియు ఇతర గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రయల్‌లో ఉన్న సిడి ఫైళ్లను, స్టేషన్ లో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డులను పరిశీలించి, వాటిని క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను పోలీసు అధికారుల అడిగి తెలుసుకుని సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ పలు సూచనలు తెలియచేసారు. పెడింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసుల్లో ప్రాపర్టీ రికవరీ శాతం పెంచాలని, అనుమానాస్పద వ్యక్తులును వెంటనే ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో చెక్ చెయ్యాలని, పాత కొత్త నేరస్థుల పై నిఘా ఉంచాలని, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు కట్టడి చెయ్యాలని, చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణకు పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించాలన్నారు.
ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలని, ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని, సైబర్ నేరాల నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం ఎస్పీ మహిళా పోలీసులతో సమావేశమై వారిని గ్రామాల్లో తాళాలు వేసివున్న ఇళ్ళు,మిస్సింగ్ పర్సన్స్ సమాచారం, కొత్త వ్యక్తుల వివరాలు,ప్రైవేట్ సీసీటీవీ కెమెరాల పనితీరును తరచూ పరిశీలించాలని, నెంబర్ ప్లేట్, పోలీస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేని వాహనాలను గుర్తించాలని, ప్రజలతో తరుచూ మమేకమవుతూ గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే గొడవలు, బాల్య వివాహాలు, అసాంఘీక కార్యకలాపాలు మరియు ఇతర అంశాలపై సమాచారమును ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియపర్చాలని సూచించారు.
ఉత్తమ పని తీరు కనపర్చిన మహిళా పోలీసులకు ప్రశంసలు
దర్శి పరిధిలో ఆత్మహత్య చేసుకోపోతున్న వారిని కాపాడి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన దర్శి మహిళ పోలీసు సరస్వతి, మాధవిలను, బాల్యవివాహం యొక్క సమాచారం సేకరించి అధికారులకు తెలియచేసి నిలిపి వేసేలా కృషి చేసిన మహిళా పోలీస్ శ్రావణి లను జిల్లా ఎస్పీ అభినందించి మెమోంట్స్ ను అందచేశారు.
పోలీసు స్టేషన్ల లోని సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఏవైనా సమస్యలపై ఆరా తీసి సర్వీస్ కు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విధినిర్వహణలో సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోటీపడి విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, ఫిర్యాదుదారులు బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పోలీసు స్టేషన్ల లోని పలు రికార్డులను చక్కగా నిర్వర్తించిన HC శ్రీనివాసులు, PC రవి శంకర్ లను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
అనంతరం ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి సిబ్బంది అందరూ స్టేషన్ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పచ్చదనంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని సూచించారు.
వేసవిలో దాహార్తుల దాహం తీర్చుటకు చలివేంద్రాలను ప్రారంభించిన ఎస్పీ మలిక గర్గ్
అనంతరం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ పాదచారులు, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు, ప్రజలు దాహార్తిని తీర్చే ఉద్దేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించి, దాహార్తులకు, మజ్జిగ, చల్లని నీరు స్వయంగా అందించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో షటిల్ కోర్ట్ ను ప్రారంభించారు.
ఎస్పీ మలిక గర్గ్ వెంట ట్రైనీ ఐపీఎస్ అంకిత సురాన, దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, DSB DSP బి.మరియదాసు, దర్శి సీఐ రామకోటయ్య, దర్శి ఎస్సై రామకృష్ణ, ఐటి కోర్ ఎస్సై కె.అజయ్ కుమార్, తాళ్లూరు ఎస్సై ప్రేమ్ కుమార్, ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్,కురిచేడు ఎస్సై దేవకుమార్, ఎస్పీ సిసి నారాయణ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.








