వాతావరణంలో చోటు చేసుకుంటున్న పలు మార్పులతో ప్రజలు తీవ్ర చెందుతున్నారు. పగటి వేళ తీవ్ర వేడిగా ఉండటం, ఒక్కసారిగా చల్లబడి తీవ్ర గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రైతులు, ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. ముండ్లమూరు మండలంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర గాలి, వర్షం రావటంతో దర్శి, అద్దంకి రోడ్లో ప్రధాన రహదారిపై ఉల్లగల్లు, పసుపుగల్లు మధ్య కోళ్ల ఫాం ప్రాంతంలో చెట్లు కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ప్రజలు. ఆర్టీసీ సిబ్బంది స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న కొమ్మలను రోడ్డు ప్రక్కకు తీసి వేయటంతో ట్రాఫిక్ క్లియర్ అయినది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

