భారత ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిది సంవత్సరాల పాలనపై దర్శి పట్టణంలో స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఒంగోలు పార్లమెంటు కన్వీనర్ సేగ్గం శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ 9 సంవత్సరాల పాలనలో మన రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి, రామలింగారెడ్డి, ప్రసాద్, నాగభూషణాచారి, ఎస్కే మన్సూర్, నాయకులు వంకదారి కుమార్, అచ్యుత శరత్ కుమార్ లు పాల్గొన్నారు.
మోదీ తొమ్మిది సంవత్సరాల పాలనపై హర్షం -పార్టీ శ్రేణులు హర్షం
02
Jun