ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం – వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహణ

ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యశాల అభివృద్ధి కమిటీ ( హెచ్ఐసీ) సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వైద్యశాల అభివృద్ధి, వసతి గురించి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో గ్రామాలలో ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇంటి వద్దకే వైద్యం అందుబాటులోనికి రావటంతో వృద్ధులకు, మహిళలకు చక్కగా ఫ్యామిలీ డాక్టర్ బాగా ఉపయోగ పడుతుందని అన్నారు. వైద్యశాలలో మిగిలిన పనుల పురోగతి గురించి, వైద్యశాలలో వసతులు త్వరగా మెరుగు పరచాల్సిన ఆవశ్యకత గురించి వైద్యాధికారి భాదర్ మస్తాన్ బి తెలిపారు. వైద్యశాలలో బయో కెమికల్ యూరిన్ ఎనాలసిస్ పరికరాన్ని, రక్త నమూనాల పరీక్షల విభాగంలో ల్యాబ్ ప్రారంభించారు. వైద్యశాలలో అన్ని వసతులు పరిశీలించారు. పూర్తి కాని విద్యుత్, రూఫ్ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని చెప్పారు. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *