రైతులకు ఉత్తమ సేవలు అందించటంలో పీపీఎల్ కంపెనీ ముందజ – జీఎం. జెఎం కౌషిక్ – పీపీఎల్ కంపెనీ డీలర్లతో సమావేశం నిర్వహణ – ముఖ్య అతిథిగా పాల్గొని దిశా నిర్ధేశం చేసిన జనరల్ మేనేజర్ (జీఎం) జె. ఎం కౌషిక్

రైతులకు అవసరమైన రీతిలో మంచి ఉత్పత్తులను అందిస్తూ పీపీఎల్ కంపెనీ ముందజలో ఉన్నట్లు పీపీఎల్ కంపెనీ జనరల్ మెనేజర్ (జీఎం) జె ఎం కౌషిక్ అన్నారు. విజయవాడ రీజియన్ పరధిలో విజయనగరం లోని సన్ రే రిసార్ట్ లోని డీలర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీఎం. జెఎం కౌషిక్ మాట్లాడుతూ… కంపెనీ ద్వారా మంచి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందిస్తున్నట్లు డీలర్లు రైతులకు సకాలంలో అందించి మెరుగైన సేవలు అందించి కంపెనీతో పాటు వ్యక్తిగత వ్యాపారం అభివృద్ధికి కృషి చెయ్యాలని కోరారు. డీజీఎం క్రిష్ణమూర్తి మాట్లాడుతూ…. అన్ని జిల్లాలకు అవసరమైన ఎరువులకు స్పీడుగా అందిస్తామని అన్నారు. డీలర్లకు డోర్ డెలివరీ అవకాశం ఉందని వినియోగించుకోవాలని కోరారు. మార్కేటింగ్ డవలప్ మెంట్ ఆఫీసర్ (ఎండీఓ) ఎస్ .ఎం.డి రఫీ మాట్లాడుతూ ….మార్కేట్లో ప్రస్తుతం పీపీఎల్ కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని వినియోగించుకుని త్వరగా అభివృద్ధి చెందాలని కోరారు. డీలర్లకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీసీ రవిచద్ర, జెఏ సుశీల్ తదితరులు పాల్గొని డీలర్లు మార్కేట్లో తమ అనుభవాలను పంచుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *