ముండ్లమూరు మండలంలోని ఈదరలో నూతనం గా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు ఐక్యంగా నిర్మించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా వెంకాయమ్మ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు మేళ తాళా లతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేయను న్నట్లు తెలిపారు. వేద పండితులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు బూచేపల్లి వెంకాయమ్మ స్వీకరించారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సూది దేవర అంజయ్య, సర్పంచ్ వంగల పద్మావతి, రెడ్డి సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ ల సంఘ మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివా సరెడ్డి, నాయకులు అబ్బని అంజిరెడ్డి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
