భూ రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం సక్రమంగా రైతులు ఉపయోగించికోవాలి -జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి

ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ సర్వేతో భూ సమస్యలకు శాశ్విత పరిష్కారం దొరుకుతుందని వక్తలు అన్నారు. తాళ్లూరు రైతు భరోసా కార్యాలయంలో మంగళవారం గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భూ సమస్యలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శాశ్విత పరిష్కారం దొరుకుతుందని రైతులు సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు. రెవిన్యూ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. తహసీల్దార్ కెవి ప్రసాద్ మాట్లాడుతూ… ఇప్పటికే డ్రాన్ సర్వే పూర్తి అయిన చోట డ్రోన్ సర్వే ద్వారా వచ్చిన ఓఆర్ ఎల్షిట్స్ తీసుకుని విఆర్డీలు రైతుల పొలాలకు వస్తారనని చెప్పారు. తర్వాత రైతు సూచన మేరకు ల్యాండ్ ప్లాన్ మెజర్మెంట్ ( ఎల్పీఎం) లు నమోదు అయి వస్తాయని చెప్పారు. 2022 నవంబర్ 1 ముందు ఉన్నా సాధారణ అగ్రిమెంట్స్ పరిగణలోనికి తీసుకుని తగిన ఆన్లైన్ కు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, డీటీ ప్రశాంత్, విఆర్ఓ చంద్ర, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సోము అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *