తాళ్లూరు గ్రామ సచివాలయాల భవనాలను, ఆర్బీ కేలను, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల ను నిర్మించి ప్రభుత్వం ప్రజలకు అవసమైన మౌళిక వసతుల ఏర్పాటుకు పెద్ద పీట వేసారని పీఆర్ (ఎం.ఎన్. ఆర్) రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ (సీఈ) ఎం క్రిష్ణా రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలో నిర్మించిన పలు సచివాలయాలను, అర్జీలను, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 34,588 గ్రామ సచివాలయాలు ఉండగా ఇప్పటికే 10,893 పూర్తి అయ్యాయని, మరో 6038 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వైఎస్సార్ ఆర్టికలో 10216 మంజూరు కాగా 4201 పూర్తి అయ్యాయని 2400 బిబిఎల్ దశలో ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు 8885 మంజూరు కాగా 2405 పూర్తి అయ్యాయని, 2693 బిబిఎల్ దశలో ఉన్నాయని చెప్పారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ 1589 మంజూరు కాగా 69 పూర్తి అయ్యాయని, మిగిలినవి వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. డిజిటల్ లైబ్రరీలు 3589 మంజూరు కాగా 26 పూర్తి అయ్యాయని, మిగిలినవి వివిధదశలలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం మీద ఐదు ప్రధాన బిల్డింగ్స్ గ్రామాలలో రూపు దిద్దుకున్నాయని చెప్పారు. అన్నింటికి చేసిన వరకు బిల్లులు మంజూరు చెసామని, పనులు త్వరంగా పూర్తిచేసి బిల్లులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పొందవచ్చని చెప్పారు. నిర్మాణాలలో
పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇకపై మెజర్మెంట్ (ఎం) బుక్స్ కూడ ఈ- ఎం. బుక్స్లు అవుతున్నాయని, ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసి బిల్లులు.పొందవచ్చని చెప్పారు.
ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తో సమావేశం. …
ఇంజనీరింగ్ అసి స్టెంట్స్తో ఎంపీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ చిన్న వయస్సులోనే ప్రభుత్వ సర్వీస్ చేయటానికి మంచి అవకాశం లభించిందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సిసి రోడ్డు, బిల్డింగ్స్ ఇతర నిర్మాణాలలో రాజీ లేని నాణ్యతతో పాటు, చక్కగా క్యూరింగ్ చేయిస్తే ఎక్కవ కాలం పాటు మన్నికగా ఉంటుందని అన్నారు. చేపిస్తున్న పనుల నాణ్యతగా ఉంటే భవిష్యత్లో కూడ మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. పనులు అన్ని సకాలంలో పూర్తి అయ్యేలా పూర్తి చేయించాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి ఇంజనీరింగ్ సిబ్బందిచే అని అన్నారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైఎస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఈఈ జి. హరే రామక్రిష్ణ, ఎఈ వెంకటేశ్వర్లు కోఅపన్మెంబర్ కరిముల్లా సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, వలి, గంగిరెడ్డిపాలెం యలమందా రెడ్డి, పులి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


