ప్రశాంత జీవితం యోగాతో సాధ్యం -యోగా శిక్షణ తరగతులు ముగింపు -యోగా శిక్షణ నిపుణుడు శ్రీరామ్ గురూజీ ఘన సన్మానం

యోగా ప్రశాంత జీవితానికి చక్కగాఉపయోగపడుతుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా విద్యానికేతన్ యోగా పాఠశాలలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న యోగా ఉచిత శిక్షణ తరగతులు గురువారం ముగిసాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ… యోగా ప్రతి రోజు చేసిన వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉంటారని, ఎంత శ్రమ చేసినా సరే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగా శిక్షణ నిపుణుడు శ్రీరామ్ గురూజీ మాట్లాడుతూ …. యోగాతో దీర్ఘకాలిక ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. యోగాతో కుటుంబాలు సైతం చక్కగా ఉపయోగించుకుని క్రమశిక్షణతో అభివృద్ధి చేసుకున్న విధానాలను వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతి రోజు ప్రాక్టీస్ చెయ్యాలని సూచించారు. అనంతరం శిష్యులు అందరూ కలసి గురూజీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి ఐ. వెంకట రెడ్డి, హెచ్ఎ క్రిష్ణారెడ్డి, ఏ బి సి హై స్కూల్ కరస్పాండెంట్ టి శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కే వెంకటేశ్వరరావు, జెసీఎస్ కెవి పాలెం కన్వినర్ కొర్రపాటి విష్ణు, ఎల్ ఐ ప్రసాద్ , పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు క్రిష్ణ, రవి, మణివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *