ఓ యువతి తన జీవితంలో తల్లిదండ్రుల చెప్పిన మాటలు వినక పోవటంతో జీవితం గాడి తప్పినదన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడినది. ఈ ఘటన తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో చోటు చేసుకున్నది. వివరాలలోనికి వెలితే తూర్పుగంగవరం పంచాయితీ పరిధిలోని హరిదాస్ నగర్ కు చెందిన జక్కుల వెంకటేశ్వర్లు దంపతులకు మనీష, ప్రియాంక, భార్గవి ముగ్గురు కుమార్తెలు. అందులో రెండవ అమ్మాయి ప్రియాంక (23). ఆమె పలు దుకాణాలలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంది. ఇటీవల కాలంలో బేకరిలో పనిచేస్తుంది. గతంలో వివాహం కాగా మూడేళ్ల క్రితం మనస్పర్ధలతో భర్తకు దూరంగా ఉంటూ విడాలకులు తీసుకుంది. తల్లిదండ్రులు దుర్గి మండలం కొలగంట్లకు చెందిన జదదీష్ సంబంధం చూసి ఈనెల 7వ తేదీన వివాహంగా నిర్ణయించుకున్నారు. అయితే ఆమె పనిచేస్తున్న బేకరి యజమాని రాజా గౌడ్ 6వ తేదిన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నది. అయితే తల్లిదండ్రులు జగదీష్ కు తమ మూడవ కుమార్తెను భార్గవిని ఇచ్చి అదే ముహుర్తానికి వివాహం జరిపించారు. దీంతో పెళ్లి కార్యక్రమాలలో కూడ మృతురాలు ప్రియాంక ఉత్సాహంగా పాల్గొన్నది. మంచి స్థోమత, పరపతి కలిగిన సంబంధం పాడు చేసుకుని ఏమి పనిచేసావంటూ బంధుమిత్రులు కూడ ప్రియాంకను విమర్శించారు. దీంతో గత కొంత కాలంగా తాను తప్పు చేసానన్న భావనతో తరచూ భర్త రాజా తో మౌనంగా వ్యవహరిస్తూ ఉండటం,.. పరిస్థితులపై ఆమె తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది…దీంతో గురువారం నివాసంలోనే ఉరి వేసికుని మృతి చెందినది. పెళ్లి అయిన 9 రోజులకు తనువు చాలించటంతో తల్లిదండ్రులు, బంధు మిత్రలు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు. తహసిల్దార్ ప్రసాద్ మృతదేహాన్ని సందర్శించారు.
