చిన్నారులను అంగన్వాడీలలో చేర్పించి పూర్వ విద్యను బలోపేతం చెయ్యాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీతలు కోరారు. మండలంలోని రమణా లవారి పాలెం, దారం వారి పాలెం గ్రామాలలో గురువారం జన బాగస్యామ్యం ( జనబాగీధార్) కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గ్రాడ్యుయేట్స్ డే నిర్వహించారు. పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించారు. మూడేళ్లు నిండిన చిన్నారులకు పాఠశాలలకు పంపించాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య, మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళా పోలీస్ శైలజ, సర్వేయర్ అనురాధ, ఎం. ఎల్. హెచ్పీ మంగా బాబు, ఆరోగ్య కార్యకర్త మేరి, అంగన్వాడీ కార్యకర్తలు పద్మజ, వేదవతి, సుభాషిణి, నాగలక్ష్మి, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

