దేశంలోనే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
పెద్ద పీట వేశారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో జగనన్న ఆణి ముత్యాలు కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గురువారం సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు షేక్ హసీనా భాను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పదో తరగతి, ఇంటర్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు ఎన్నీ సౌగందిక, ఎం .సంతోష్, సీహెచ్ కీర్తన, కేవీ సంధ్య, పి. యశ్వంతో పాటు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ప్రథమ స్థానంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థికి రూ.15 వేలు, ద్వితీయ స్థానం రూ.10 వేలు, తృతీయ స్థానం లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు రూ.5 వేల నగదుబహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ మాట్లాడుతూ …ప్రభుత్వ పాఠశాల విద్యా విధా నంలో, పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం లో, సీఎం జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ స్థాయిలో తల దన్నేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారని కొనియా డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏ మాత్రం గౌరవం తగ్గకుండా జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి తగిన గౌరవం, గుర్తిం పు అందించడంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి నగదు బహుమతులతో పాటు సత్కరించడం అభినందనీయమన్నారు. ఎంపీపీ సుధా అచ్చయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఎం ఈఓ కాకర్ల రఘురామయ్య, మండల కన్వీనర్ వెన్న పూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకా రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు సైదా పాల్గొన్నారు.


