నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు – జోరుగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

నవరత్నాలతో పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలోని ఎనిమిదో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలపై అవగాహన కల్పించారు. పథకాలు అందని వారికి కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… రాష్ట్రం లో అభివృద్ధి,సంక్షేమం ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికే సాధ్యమైందన్నారు. గడప గడ పకు మనప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతూ ఉంటే ప్రజలకు ఏం కావాలో ఇట్టే తెలిసిపోతోందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 175కు 175 సీట్లు రావడం ఖాయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎంపీపీ సుధా అచ్చయ్య , వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి , రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సం ఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, కౌన్సిలర్ జ్యోతి,బూబారావు, బీసీ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలు శ్రీనివాస రావు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లంకోజనపల్లి రోడ్ లో..
సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె సాధ్యమైందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. లంకోజనపల్లి రోడ్డు నాలుగో సచివా లయం పరిధిలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. గడప గడపకు వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. వార్డులో రోడ్లు, కరెంట్, తాగునీరు సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *