తాళ్లూరు మండలంలో మూడు పంచాయితీలకు గ్రామకార్యదర్శులను
నియమిస్తూ ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేసారు.
విఠలాపురం గ్రామకార్యదర్శి సోము భాగ్యలక్ష్యిని మన్నేపల్లి పంచాయితీ గ్రామకార్యదర్శిగా, తాళ్లూరు గ్రామకార్యదర్శి జె. లక్ష్మి కాంత్ , శివరామపురం ఇన్చార్జి గ్రామ కార్యదర్శిగా, దోసకాయలపాడు పంచాయితీ కార్యదర్శి బాచిన రేణుకను, లక్కవరం ఇన్చార్జి గ్రామకార్యదర్శిగా నియమించారు. నూతనంగా గ్రామకార్యదర్శుగా వచ్చే వరకు ఇన్చార్జిలను పాలనా సౌలభ్యం కొరకు నియమించినట్లు ఎంపీడీఓ ఉత్వర్వులలో
పేర్కొన్నారు.
మూడు పంచాయితీలకు ఇన్చార్జి గ్రామకార్యదర్శుల నియామకం
17
Jun