ఎస్సీ ఎస్టీ రైతులు వ్యవసాయ అభివృద్ధి పథకాలపై అవగాహన పెంచుకోవాలి-.మండల వ్యవసాయ అధికారి బి. ప్రసాదరావు

దళిత బహుజన రిసోర్స్ సెంటర్(DBRC)- ప్రకాశం జిల్లా

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి పథకాలను ఎస్సీ ఎస్టీ రైతులకు దగ్గరగా తీసుకొని రావడం కొరకు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా యాంత్రికరణ వస్తువులు,భూసార పరీక్షలు మరియు విత్తనాలు ఎరువులు సబ్సిడీ రూపంలో అందిస్తున్నదని ఈ పథకాలు కౌలు రైతులు కూడా వర్తిస్తాయని తాళ్లూరు మండల వ్యవసాయ అభివృద్ధికి అధికారి బి. ప్రసాదరావు తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కో-ఆర్డినేటర్ గోపన బోయిన వెంకట్రావు అధ్యక్షతన మండల స్థాయి లో ఎస్సీ ఎస్టీ రైతులకు వ్యవసాయ అభివృద్ధి పథకాలపై తాళ్లూరు వైయస్సార్ రైతు భరోసా కేంద్రం -1 నందు జరిగిన అవగాహన సదస్సుకు అధ్యక్ష వహించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించుకుంటూ, కలుషిత ఆహారాన్ని దూరం చేయాలని దాని ద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజాన్ని చూడగలుగుతామని ఆయన అన్నారు. తాళ్లూరు రైతు భరోసా కేంద్రం గ్రామ వ్యవసాయ సహాయకుడు ఎన్.నాగార్జున నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమ ద్వారా అధిక లాభాలు చేకూర్చలనే ఆలోచనతో 90 శాతం సబ్సిడీతో గోడౌన్లు మరియు మలబార్ మొక్కలు సబ్సిడీతో ఇస్తున్నందున ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ సదస్సుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులు తదుపరి ఉచితంగా కందులు పంపిణీ చేయడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *