ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామానికి చెందిన రిటైర్ ఉపాధ్యాయుడు బేతపూడి చెంచారావు మనవడు ఎండ్లూరి హనుమ నిహార్ చౌదరి జేఈఈ ఆల్ ఇండియా అడ్వాన్స్ మెయిన్లో 389 ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. ఈ విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో 200 ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్లో 319 ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి పదవ తరగతి, ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య (గాయత్రి భవన్) లో విద్యను అభ్యసించాడని విద్యార్థి తల్లిదండ్రులైన ఎండ్లూరి శ్రీనివాసరావు, ఉష ,తెలిపారు. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థికి ముండ్లమూరులోని విద్యార్థి బంధువులు ముండ్లమూరు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
జేఈఈ అడ్వాన్స్ మెయిన్లో ప్రతిభ చాటిన ముండ్లమూరు విద్యార్థి ఎండ్లూరి హనుమ నిహార్ చౌదరి
19
Jun