తూర్పు గంగవరం, బొద్దికూరపాడు ఆర్ అండి రోడ్ ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణలో ఆర్టీసి అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులతో పాటు ముఖ్యంగా పాఠశాలలు పునః ప్రారంభం నాటి నుండి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్డి సాగర్, వెలుగు వారిపాలెం గ్రామాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. గతంలో బస్సులు ఒంగోలు డిపో నుండి తిరుగుతూ ఉండటంతో ఇబ్బందులు లేకుండా పోయాయి. అయితే పొదిలి డిపో నుండి బస్సులు ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణికుల కష్టాలు మొదలు అయ్యాయి. ప్రజలు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులును ఆయా గ్రామాల సర్పంచిలు, వైఎస్సార్సీపీ నాయకులు పొదిలి డిపో మెనేజర్ దృష్టికి కూడ తీసుకువెళ్లారు. 13వ తేది నుండి అన్ని బస్సులు తిప్పుతాయమని పొదిలి డిపో మెనేజర్ హామీ ఇచ్చినప్పుటికి అమలుకు నోచుకోలేదు. దీంతో ఆయా గ్రామాల నుండి నిత్యం విద్యార్థులు ఎండ వేడిమికి సైతం నడిచి పోవటం పలువురుని చలించి వేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆయా రూట్లలో బస్సులను వెంటను పునరుద్దరించాలని కోరుతున్నారు.
బొద్దికూరపాడు రూట్లో బస్సులు తిప్పండీ సారూ ! -బస్సులు పునరిద్దరించ లేక పోవటంతో విద్యార్థులకు ఇబ్బందులు – 10 కి.మీల మేర నడిచి వెళ్తున్న విద్యార్థులు
20
Jun