ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీలకతీతంగా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని సంక్షేమాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడ పకు మనప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గడపగడపకూ తిరిగి వారికి అం డుతున్న సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకు న్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వంకార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో ప్రజా
ల్ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని తెలిపారు. సంక్షేమం ప్రజలకు అందించడంలో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పారు. ఎన్నికల సమయా నికి తప్ప ప్రజలు కష్టాలు తెలుసుకోవాలని ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రభుత్వం తప్ప దేశంలో ఏప్రభుత్వం గడప గడపకు వెళ్ళి సమ స్యలు పరిష్కారం చేసిన దాఖలాలు లేవని అన్నారు. మండల పార్టీ కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య,కౌన్సి లర్ ఆవుల జ్యోతి, , వేమిరెడ్డి చెన్నారెడ్డి, ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షులు బండి గోపాల్ రెడ్డి, నాయకులు కిక్కురు రమణారెడ్డి, మిల్లర్ బుజ్జి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎర్రయ్య, గోవింద్ ప్రసాద్ పాల్గొన్నారు.


