ప్రపంచ యోగా దినోత్సవంను మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు, తూర్పు గంగవరం యోగాలయం ఆధ్వర్యంలో శ్రీరామ్ గురూజీ శిష్యులు తూర్పుగంగరం ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచానికి భారత దేశం అందించిన సంజీవని యోగా అని దీని సాధన ద్వారా పూర్వికులు అనేక అద్భుతాలు చేసారని అన్నారు. యోగా సాధనతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత వస్తుందని అన్నారు. విద్యార్థులు చిన నాటి నుండే యోగాను ప్రాక్టీస్ చెయ్యాలని కోరారు. మాజీ వైఎస్ ఎంపీపీ ఐ. రమాదేవి, ఎఈ వీరబ్రహ్మం, పలువురు ప్రముఖలు
పాల్గొన్నారు.

