చిరుధాన్యాల సాగు పెంపు లక్ష్యంగా ప్రతి రైతు పాటు పడాలని దర్శి ఎడీఏ కె.
బాలాజి నాయక్ అన్నారు. బెల్లంకొండ వారి పాలెంలో బుధవారం కొర్ర
మినికిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొర్ర 80 రోజులలో చేతికి వస్తుందని అన్నారు. మంచి గిట్టుబాటు ధర ఉందని చెప్పారు. రైతులు మినికిట్స్ను అందించారు. సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ సరస్వతి, వ్యవసాయాధికారి ప్రసాదరావు, విఏఏ భార్గవి, జెడిఎన్ఎఫ్ పి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాల సాగు పెంపే లక్ష్యం – ఎడీఏ బాలాజి నాయక్
21
Jun