జగనన్న సురక్ష అమలుకు రెండు బృందాలు

తాళ్లూరు మండలంలో జగనన్న సురక్ష పథకం అమలుకు అధికారులతో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ వై. శ్రీనివాస రావు తెలిపారు. అందులో ఒకటవ బృందంలో తహసీల్దార్ కెవీ ప్రసాద్, ఈఓఆర్డీ కెజీఎస్ రాజు, తహసీల్దార్ కార్యాలయ సీనియర్ సహాయకులు పీవీఎస్ఆర్ మూర్తి, రెండవ బృందంలో ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ ఇస్మానియేల్ రాజు, మండల ప్రజా పరిషత్ సీనియర్ సహాయకులు పి.శ్రీనివాసరావులు ఉన్నారు. ఆయా బృందాలు మండలంలో 14 సచివాలయాల పరిధిలో జులై ఒకటి నుండి 14 వరకు జగనన్న సురక్ష పథకం ద్వారా 9 రకాలు సేవలు అందించనున్నట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *