ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని జిల్లా పంచాయితీ అధికారి, దర్శి నియోజక వర్గ ప్రత్యేక అధికారి జి. వి నారాయణ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలో తాళ్లూరు, శివరామపురంలలో శనివారం వలంటీర్లు ఇంటింటికి తిరిగి చేస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ జీవి నారాయణ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా సేవలు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం నివాసం వద్దకే సేవలు అందించేందుకు జగనన్న సురక్ష పథకం తీసుకువస్తుందని చెప్పారు. అర్హత ఉండి ఏవైనా సాంకేతిక సమస్యలతో పథకాలు రాని వారికి తప్పనిసరిగా మేలు చేకూరే అవకాశం ఉందని అన్నారు. ప్రజలకు అవసమైన సేవలను గుర్తించి ఆన్లైన్లో నమోదు చెయ్యాలని సూచించారు. క్యాంపులో తప్పనిసరిగా ప్రజా ప్రతినిథులు హాజరు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా గ్రామాలలో చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోనికి తీసుకువచ్చే విషయం సర్పంచి. గ్రామకార్యదర్శులతో చర్చించారు. కార్యక్రమంలో తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, ఈఓఆర్డీ కేజీఎస్ రాజు, గ్రామకార్యదర్శి లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు.

