బొద్ధి కూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మంగళవారం పాఠశాలయందు తల్లిదండ్రుల సమావేశం ప్రధానోపాధ్యాయులు
సురేష్ అధ్యక్షతన నిర్వహించడమైనది. మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వం విద్యకి ఇస్తున్న ప్రాధాన్యతపై ప్రసంగించారు. పాఠశాల కమిటీ చైర్మన్ వై.కృష్ణారెడ్డి , ,కమిటీ సలహాదారులు పి. ప్రసాద్ రెడ్డి గారు, ఎస్.అంజిరెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులుహాజరయ్యారు. వక్తులందరూ ప్రభుత్వ పథకాలు మనబడినాడు – నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న ఆణిముత్యాలు, జగనన్న గోరుముద్ద, సీబీఎస్ఈ, సిలబస్ లో ఇంగ్లీష్‌మీడియం బోధన స్మార్ట్ టీవీలు, బై జ్యూస్ కంటెంట్ తో ట్యాబ్‌లు, రాగిజావ, విద్యార్థులకు స్టీల్గ్లాసెస్ పంపిణీ, విద్యార్ధుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య పరీక్షలు, స్కూల్లో ఇంటర్నెట్సదుపాయం తదితర అంశాలపై తల్లిదండ్రులు ల కి పూర్తి అవగాహన కల్పించారు.

