తాళ్లూరు మండలం లో విత్తన విక్రయ షాపు డీలర్లు రైతులకు జవాబుదారిగా ఉం డాలని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద రావు తెలిపారు. తాళ్లూరులోని పలు షాపుల్లో మంగళవారం ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అనుమతి పొందిన షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొను గోలు సమయంలో రసీదులు తీసుకోవాలని చెప్పారు. గడువుతీరిన విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు.
డీలర్లు రైతులకు జవాబుదారీగా ఉండాలి – వ్యవసాయాధికారి ప్రసాదరావు
28
Jun