దర్శి మండలం లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని దిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారని, అలా ఎక్కడా జరగడం లేదని సహాయ వ్యవ సాయ సంచాలకులు బాలాజీ నాయక్ తెలి పారు. పట్టణంలోని పలు ఎరువులు విత్తనాల దుకాణాల్లో మంగళవారం ఆయన తనిఖీలు చేశారు. బాలాజీనాయక్ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో 16,172 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నామన్నారు. గత సంవత్సరం 13 వేల నుంచి 14 వేల వరకు పత్తికి ధర పలక డంతో ఈ సంవత్సరం కూడా పంటపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, వ్యవసా యాధికారి ఆదేశాల మేరకు విత్తన షాపులపై అకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు. మండలంలోని రైతు భరోసా కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేసి రాత్రి వేళ్లల్లో జీపుల్లో వచ్చి అమ్మే వారిని గుర్తించాలని ఆదేశించినట్లు తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన 40 మంది ప్రైవేటు డీలర్ల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు తెలిపారు. రైతులు ఎక్కడ కొనుగోలు చేసినా బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలని సూచిం చారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్త నాలు కొనుగోలు చేయాలని చెప్పారు.
అవాస్తవాలు ప్రచురించొద్దు -సహాయ వ్యవ సాయ సంచాలకులు బాలాజీ నాయక్
28
Jun