మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మరో మూడు కొత్త జూనియర్ కాలేజీలు మం జూరు అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో 14 జూనియర్ కాలేజీలు ఉండగా, కొత్తగా మం జూరైన వాటితో కలిపి ఆ సంఖ్య 17కు చేరిం ది. కొత్త జూనియర్ కాలేజీలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించారు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవ ర్గంలోని బేతంచర్ల(బాలురు), చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని సదూం(బాలురు), శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస(బాలికలు) కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఒక్కో కాలేజీలో ఎం పీసీ 40, బైపీసీ 40 సీట్లు చొప్పున కేటా యించారు. కాగా, రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మొత్తం 105గురుకులాలు ఉన్నాయి. వాటిలో 17 జూని యర్ కాలేజీలు కాగా, మిగిలిన 88 పాఠశా లల్లో 5 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేల మంది విద్యార్థులు వీటిలో చదువుతున్నారు.
కొత్తగా మూడు గురుకుల జూనియర్ కళాశాలలు మంజూరు -నంద్యాల, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏర్పాటు -ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి క్లాసులు -ఒక్కొక్క కళాశాలలో ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్లు-17కు చేరిన ఏపీ బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల సంఖ్య
28
Jun