ప్రకాశం జిల్లా స్థాయిలో ఆర్బిఐ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైనాన్సియల్ లిటరసీ క్విజ్ కార్యక్రమంలో తాళ్లూరు మండల విద్యార్థులు ప్రతిభ చాటారు. లక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పూర్ణ శివాజి, డినేష్ రెడ్డిలు క్విజ్ పోటీలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో వెలిగండ్ల మండలం ఇమ్మడి చెరువుకు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, తృతీయ స్థానంలో ఒంగోలు మండలం ఉలిచి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిలచినట్లు కెనరాబ్యాంక్ మెనేజర్ పసుపులేటి ధర్మసాయి తెలిపారు. విజేతలకు ప్రధమ బహుమతి రూ. 10వేల రూపాయలు , ద్వితీయ బహుమతి రూ.7,500, తృతీయ బహుమతి రూ. 5వేల చొప్పున ఎల్డీఎం యు. అబ్దుల్ రహీం, లీడ్ జిల్లా అధికారి బి. అనీల్ కుమార్, డీసీఈబీ సెక్రటరీ వెంకట రెడ్డి, ఇండియన్ బ్యాంక్ చీఫ్ మెనేజర్ డి. రామారావు, తాళ్లూరు కెనరా -బ్యాంకు మేనేజర్ పసుపులేటి ధర్మసాయిలు అందించారు. విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
