తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం సెంట్రల్ నోడల్ అధికారి జలశక్తి అభయాన్ డైరెక్టర్ ట్రైబల్ ఎఫైర్స్ న్యూఢిల్లీ మనోజ్బాపన, టెక్నికల్ అధికారి పి యాదయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ కె శీనారెడ్డిలు చేపట్టిన పనులను పరిశీలించారు. తాళ్లూరు మండలంలోని నాగం బొట్లపాలెం, తాళ్లూరు గ్రామాలలో పండ్ల తోటల పెంపకం, పంట కాలువలో పూడికతీత పనులును వారు బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి రోజు వారి కూలి, వారం వారం కూలి గురించి అడిగి తెలుసుకున్నారు. పండ్ల తోటల పెంపకంలో భాగంగా తైవాన్ జామ ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం కూలీలకు, రైతులకు అండగా ఉండేందుకే ఈ పధకాన్ని అమలు చేస్తుందన్నారు. అర్హతగల వారు సద్వినియోగం
చేసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాలలో తాళ్లూరు, నాగంబొట్లపాలెం సర్పంచ్ లు ఎమ్ చార్లెస్ సర్జన్, చిమట సుబ్బారావు, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాసరెడ్డి, తాళ్లూరు పంచాయితీ కార్యదర్శి లక్ష్మీకాంత్, ఏపీఓ మురళి, ఈసీ ప్రసాద్, సాంకేతిక సహాయకులు. క్షేత్రసహాయకులు పాల్గొన్నారు.


