ఏకలవ్యుడు పరాక్రమ వంతుడని ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు. దర్శి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏకలవ్యుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గురువుకు ఇచ్చిన వాగ్దానం మేరకు తన బొటన వేలుని సైతం గురుదక్షిణగా ఇచ్చిన చరిత్ర ఏకలవ్యుడిదని కొనియాడారు. సంఘసేవకులు జీవీ రత్నం, ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షులు రత్నం, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం,
దళిత సంఘ నాయకుడు జి. ప్రేమకుమార్, రవి, మార్క్ తదితరులు పాల్గొన్నారు.
