ఒంగోలు పీజీ సెంటర్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన పరిశోధన విద్యార్ధి పసుపులేటి పాపారావుకు నాగార్జున విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది ఈ మేరకు విశ్వవిద్యాలయం రీసెర్చ్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ పి.కిరణ్మయి నోటిఫికేషన్ విడుదల చేశారు. పీసీ సెంటర్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్, గైడ్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ అమృతవల్లిదేవి పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ఎమోషనల్ ఇంటిలిజెన్స్ అండ్ అకడమిక్ స్ట్రెస్ ఎమాంగ్ ఇంటర్మీడి యట్ స్టూడెంట్’ అనే అంశంపై రీసెర్చ్ చేసిన పాపారావుకు డాక్టరేట్ దక్కింది. ఎం ఏ హిస్టరీ చేసిన ఆయన పలు కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. అంతేగా కుండా పలు పత్రికలలో వ్యాసాలు రాసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ సంద ర్భంగా పలువురు అధ్యాపకులు పాపారావును అభినందించారు.
పసుపులేటి పాపారావుకు డాక్టరేట్
30
Jun