జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సేవలు ఉచితం -మండల ప్రత్యేకాధికారి కెవీ ఉపేంద్రకుమార్

ప్రజలకు అత్యవసరంగా అవసమైనసేవలను పారదర్శకంగా 11 రకాల సేవలను ఎలాంటి యూజర్స్ చార్జీలు లేకుండా ఉచితంగా జగనన్న సురక్ష పథకం ద్వారాక్యాంపులో ఉచితంగా అందజేయటం జరుగుతుందని మండల ప్రత్యేకాధికారి కెవీ ఉపేంద్రకుమార్ తెలిపారు. ఎంపీడీవో చాంబర్ లో జగనన్న కార్యక్రమంపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జూన్ 24వ తేదీ నుండి వటంటీర్లు తమ క్లస్టర్లోని ఇళ్లను సందర్శించి ప్రజల ప్రభుత్వ పరంగా ఏఏ సేవలు అ వసరమో గుర్తించి ఆన్లైన్లో ధరఖాస్తు చేయటం జరిగిందన్నారు. మండల టీమ్ ఆద్వర్యంలో 1 వ తేదీ నుండి సచివాలయాల వద్ద క్యాంపులు నిర్వహించటం జరుగు తుందన్నారు. క్యాంపులకు లబ్ధిదారులను పిలిపించి 11 రకాల సర్టిఫికేట్ ను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. తాళ్లూరు-1, విఠలాపురం సచివాలయాలను సంద ర్శించారు. ఆయా గ్రామాల్లో వలంటీర్లు ఎంతమేర జగనన్న సురక్ష పథకం అవసరమో గుర్తించి ఆన్లైన్లో దరఖాస్తు చేయటం జరిగిందన్నారు. మండల టీమ్ల ఆద్వర్యంలో 1వ తేదీ నుండి సచివాలయాల వద్ద క్యాంపులు నిర్వహించటం జరుగుతుందన్నారు. క్యాంపులకు లబ్ధిదారులను పిలిపించి 11 రకాల సర్టిఫికేట్ను పంపిణీ చేయటంజరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో వాలంటీర్లు ఎంతమేర జగనన్న సురక్ష పథకం యాప్ లో నమోదు చేశారో పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెవి ప్రసాద్ కార్యాలయ అడ్మిస్ట్రేటివ్ అధికారి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, వెల్ఫేర్ అసిస్టెంట్ కె.కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *