సొంత నిధులతో విద్యార్థులకు చేయూత ఇవ్వటం అభినందనీయమని వక్తలు అన్నారు.దర్శి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ సోముదుర్గా రెడ్డి ఆరు సైకిళ్లు పంపిణీ చేశారు. చింతల పాలెం నుంచి దర్శికి రావాలంటే విద్యా ర్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం ఖాదర్ మస్తాన్, విద్యాకమిటీ చైర్మన్ శ్రీనివాసరావు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


