మండల విద్యాధికారులు-1 పోస్టులను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు చెందిన గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పునకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని పేర్కొంది. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున సీనియారిటీ జాబితాను శుక్రవారం లోపు సిద్ధం చేయాలని, జులై 2న జాబితా ప్రకారం ఐచ్ఛికాలు తీసుకోవాలని ఆర్జేడీలను ఆదేశించింది. 3న కొత్త పోస్టుల్లో చేరాలని సూచించింది.
ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకే ఎంఈఓ-1
01
Jul